వరంగల్ క్రైమ్ : పోలీసులకు చిక్కకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకొని, పేకాట క్లబ్బుల తరహాలో మందు, విందు, వసతి సౌకర్యాలు కల్పించుకొని హైటెక్ రేంజ్ లో పేకాట ఆడుతున్న గుట్టును వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్ట బయలు చేశారు. ఇంటినే పేకాట స్థావరంగా మార్చుకొని, వారి ఇంటి వైపు వచ్చి పొయ్యే వారి ధృశ్యాలను సి సి టి వి కెమెరా ఫుటేజీలతో గమనిస్తూ, యద్దేచ్చగా నిరాటంకంగా సాగుతున్న పేకాటరాయుళ్ల బాగోతాన్ని బయట పెట్టారు.
ఇంటినే పేకాట స్థావరంగా మార్చుకొని పేకాడుతున్న పది మంది పేకాటరాయుళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. పేకాటలో అరితేరిపోయిన వారంతా హన్మకొండ నడిబొడ్డున గల కిషన్ పురలోని దేవా మధుబాబు ఇంటిలో పేకడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందుకున్నారు. టాస్క్ ఇన్స్ పెక్టర్ సంతోష్ నేతృత్వంలో దాడి చేసి పది మంది పేకాటరాయుళ్లను పట్టుకొన్నారు.
ఇన్నోవా వెహికిల్ (ఎపి 28 బిటి 3630) ను సీజ్ చేశారు. పది మంది పేకాటరాయుళ్లను నుండి 37 వేల 170 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తన ఇంటినే పేకాట కేంద్రంగామార్చిన ఇంటి యజమాని,పేకాట ఆర్గనైజర్ అయిన దేవా మధుబాబు పేకాట క్లబ్బుల్లో డబ్బులు వసూళ్ళు చేసిన్నట్టే, ఇక్కడ కూడా డబ్బులు వసూళ్ళకు పాల్పడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణలో బయట పడింది. పేకాట క్లబ్బుల్లో కల్పించిన సౌకర్యాలు, భోజన వసతి ఏర్పాట్లు సమకూర్చిన్నట్లు గుర్తించారు.
వరంగల్, మండిబజార్ కు చెందిన తోనుపునూరి శ్రీనివాస్ (40), హన్మకొండ, న్యూ రాయపురకు చెందిన చుక్క శశిధర్ (40), నర్సంపేటకు చెందిన కోమల్ల కరుణాకర్ (45), హన్మకొండ అలంకార్ జంక్షన్ కు చెందిన మాధరెడ్డి సాగర్ (52), హన్మకొండ, సింగారం గ్రామానికి చెందిన గాలి కుమారస్వామి (48),నర్సంపేట, కమ్మపల్లికి చెందిన పెండ్యాల మధు (40), కె.గోపాల్ రెడ్డి, హన్మకొండ విద్యారణ్యపురికి చెందిన మేక మోహన్ రెడ్డి (51), హన్మకొండ కొత్తూరు జెండాకు చెందిన పురాజ్ కొమురెల్లి (55)లతో పాటు ఇంటినే పేకాట స్థావరంగా మార్చి ఆర్గనైజింగ్ చేస్తూ, ప్రతి ఆటపై అదనపు వసూళ్ళు చేస్తున్న దేవా మందుబాబులను అరెస్ట్ చేశారు. పేకాట క్లబ్బులు మూత పడ్డ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా, రహస్యంగా సాగుతున్న పేకాట కాస్తా, టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడితో ఇళ్ళనే పేకాట క్లబ్ గా మార్చి, పేకాట ఆడుతున్నట్లు వెలుగు చూసింది. పేకాట క్లబ్బుల్లో సమకూర్చిన్నట్లుగా మందు, విందుతో పసందుగా పేకాట ఆడుతున్నట్లు బయట పడింది.