భూపాలపల్లి : నిరుద్యోగ యువత ఇష్టపడి చదివితే గమ్యాన్ని ఖచ్చితంగా చేరవచ్చని, శ్రమిస్తేనే ఫలితం ఉంటుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ వి.శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్, పోలీస్ శాఖ సహకారంతో నిరుద్యోగ యువతకు పోలీస్ రిక్రూట్ మెంట్ కు సంబంధించిన ఫ్రీ కోచింగ్ సెలెక్షన్, (స్క్రీనింగ్ టెస్ట్) నిర్వహించారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో ఎంపికైన అభ్యర్థులకు 2 నెలల పాటు ఉచిత వసతి, దేహదారుడ్య సామర్ధ్య శిక్షణతో పాటు వివిధ సబ్జెక్టులకు క్లాసులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ వి.శ్రీనివాసులు మాట్లాడుతూ… నిరుద్యోగ యువత పోలీసులతో పాటు, అన్నీ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఉద్యోగ అవకాశo పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డెవలప్ మెంట్ ఆధికారిణి సునీత, భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి, రిజర్వ్ ఇన్ స్పెక్టర్ సంతోష్ కుమార్, ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు యాదిరెడ్డి, మధుకర్, శ్రావణ్, చరణ్, వీరన్న పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement