గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం రోడ్డు బురదగా మారి నడవడానికి కూడా వీల్లేకపోవడంతో కాలనీ వాసులు రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. మోడల్ పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయం, బీసీ బాలికల వసతి గృహం, విద్యుత్ సబ్ స్టేషన్, మార్కెట్ యార్డు, పల్లె ప్రకృతి వనం, ప్రభుత్వ నర్సరీ తదితర సంస్థలు ఉండడంతో ఉదయం నుండి నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు బురదమయంగా ఉండి విద్యార్థులు, వివిధ అవసరాల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలు జారీ పడిపోతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారి సత్వరమే రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించి విద్యార్థులు ప్రజల ఇబ్బందులను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement