Monday, November 18, 2024

మునిగిన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం..!

వరంగల్: ములుగు జిల్లా మేడారంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క-సారలమ్మ ఆలయం సహా అనేక చోట్ల రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరింది. దీంతో గుడిసెలలో ఉండే ఆదివాసీలు నిరాశ్రయులై సాయం కోసం ఎదురు చూస్తున్నారు. జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామమంతా నీట మునగగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అటు మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద వనదుర్గ అమ్మవారి ఆలయంలోకి వరద చేరింది. దీంతో దర్శనాలు నిలిపేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement