స్వనిధి సే సమృద్ధి ప్రక్రియ పరిశీలన.
నమోదు ప్రక్రియ పై వీధి వ్యాపారుల అభిప్రాయ సేకరణ.
కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
వరంగల్: వీధి వ్యాపారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ నేషనల్ మిషన్ మేనేజర్ డా.గగన్ ప్రీత్ కౌర్ అభిప్రాయపడ్డారు.స్వానిది సే సమృద్ధి కార్యక్రమం లో భాగం గా ఈ నెల 6 నుండి వీధి వ్యాపారుల కుటుంబసభ్యులకు వివిధ కేంద్ర పథకాల అనుసంధానం లో భాగం గా బల్దియా ఇండోర్ స్టేడియం లో కొనసాగుతున్న నమోదు ప్రక్రియను బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె వీధి వ్యాపారుల తో మాట్లాడుతూ నమోదు ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక గ్రూపు లకు ఋణాలు అందుతున్నాయా,ఋణాలను ఏవిధం గా సద్వినియోగం చేసుకుంటున్నారు,నగరం లో ఎన్ని టి.ఎల్.ఎఫ్.లు పనిచేస్తున్నాయని అడిగి తెలుసుకుని, ఆర్థిక పరమైన సమృద్ధి సాధించడానికి పేటీఎం ఆప్,గూగుల్ పే ఆప్ ల డౌన్లోడ్ గురించి ఎస్.హెచ్.జీ. లకు శిక్షణ ఇచ్చారా,అని అడుగగా ఇచ్చారు అని వారు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మిక శాఖ,ఆరోగ్య శాఖ,రేవిన్యూ శాఖ ల సమన్వయం తో తో వీధి వ్యాపారుల కుటుంబ సభ్యులకు అర్హత ఉన్న అన్ని పథకాలను వారికి అనుసంధానం చేస్తూ వారి ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అంతకుముందు ఆన్లైన్ ద్వారా కొనసాగుతున్న నమోదు ప్రక్రియ విధానాన్ని ఆపరేటర్ ను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బుధవారం 354 మంది వీధి వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నట్లు పి.డి.తెలిపారు.
ఈ కార్యక్రమం లో మెప్మా పి.డి.భద్రు నాయక్, డిప్యూటీ లెబర్ కమిషనర్ జాన్,డిప్యూటీ డి.ఎం. హెచ్.ఓ.యాకుబ్ పాషా,అసిస్టెంట్ లెబర్ ఆఫీసర్ వినోద,ఎల్.డి.ఎం.మురళి కృష్ణ,డి.ఎం.సి.రజిత రాణి,ఐ.సి.డి.ఎస్ సి.డి.పి.ఓ.లు విశ్వజ,సింధూరా,టి.ఎం.సి.రమేష్,సి.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.