ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి/చిట్యాల : మహిళా శక్తితో రాజ్యాధికారం సాధ్యమని మహిళలంతా ఏకమై ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా పాదయాత్రలో భాగంగా బుధవారం గణపురం జెడ్పిటిసి గండ్ర పద్మ సత్యనారాయణ రావు అధ్యక్షత చిట్యాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటి కోసం రూ.5 లక్షలు ప్రభుత్వం నుండి అందజేస్తామన్నారు. రైతులకు రుణ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకంకు రూ. 5 లక్షల వరకు ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నారు. రూ.500 కే ఇంటింటికి ఎల్పీజీ సిలిండర్ అందజేస్తామన్నారు. మహిళా సాధికారిక లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలోకి రాగానే 25శాతం రిజర్వేషన్ తో నలుగురు మహిళలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.
నిరుద్యోగ సమస్య తీర్చేందుకు మొదటగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ మహిళల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారన్నారు. గల్లీ గల్లి నా బెల్ట్ షాపులు, బార్లు తీసి పేద ప్రజలను మభ్యపెడుతు రెండుసార్లు సీఎం అయ్యారన్నారు. మహిళలంతా ఏకమై ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీని సోనియమ్మ నాయకత్వంలో మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మహిళలను కోరారు. ఈ సమావేశంలో భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి గండ్ర సత్యనారాయణ రావు, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా జాతి అధ్యక్షురాలు, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క, మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, స్థానిక జెడ్పిటిసి, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుడపాక శంకర్, నాయకులు మధు వంశీకృష్ణ, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు నాయకులు, మహిళలు పాల్గొన్నారు.