వాజేడు : గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి వరద నీరు అత్యధికంగా చేరడంతో ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని టేకుల గ్రామం వద్ద 163 జాతీయ రహదారి ముంపునకుగురికావడంతో అంతరాష్ట్ర రాకపోకలు నిలిచిపోయి. రవాణా సౌకర్యం తప్పించింది తెలంగాణ చతిస్గడ్ సరిహద్దు ప్రాంతమైన టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై గోదావరి వరద నీరు రెండు అడుగులకు పైగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అటువైపుగా వాహనాలు తిరగడం లేదు. అదేవిధంగా గుమ్మడిదొడ్డి వాజేడు గ్రామాల మధ్య ఉన్న కొంగల వాగు వంతెన నీట మునగడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి రవాణా సౌకర్యం స్తంభించింది. అదేవిధంగా పేరూరు చందుపట్ల గ్రామాల మధ్య ఉన్న మరి వాగు బ్రిడ్జి నీట మునగడంతో ఆయా గ్రామాలకు రవాణా సౌకర్యం స్తంభించింది ఎడతెరిపి లేకుండా వర్షాలు జోరుగా కురుస్తుండటంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీనితో గోదావరి ఉధృతంగా పెరుగుతూ వాజేడు మండలం పేరూరు వద్ద ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయానికి 12.660మీటర్లకు చేరుకుంది. దీనితో లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అతివేగంగా గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిడబ్ల్యూసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మేడిగడ్డ తుపాకులగూడెం సమ్మక్క సారలమ్మ బ్యారేజీల గేట్లు పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో గోదావరి మరింతగా పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యుసి అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి రవాణా సౌకర్యం స్తంభించింది. మండల పరిధిలోని చీకుపల్లి బోగత జలపాతం ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు జలపాతం వద్దకు వెళ్లడానికి అనుమతించడం లేదు వాజేడు ఎస్సై తిరుపతి రావు గోదావరి ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్న వెంటనే అధికారులకు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.. వాజేడు మండలంలోని మురుమూరు గ్రామంలో ఇల్లు నీటిమలగడంతో పునరావాస కేంద్రాలకు ఆయా కుటుంబాలను తరలించారు. జోరుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఎవరు బయటకు రావద్దని గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement