ట్రైబల్ వెల్ఫేర్ పాటశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినాని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. హైదరాబాద్ లో క్రిస్టినాని ఎమ్మెల్యే సీతక్క కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గంలో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు త్రీవ ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాలల్లో మరమ్మతులు, సౌకర్యాలను కల్పించాలని కోరారు. 2022-23 అకాడమిక్ విద్య సంవత్సరం పూర్తి కావడానికి మూడు నెలలు మాత్రమే ఉన్నప్పటికీ కనీసం ఇప్పటి వరకు విద్యార్దులకు యూనిఫాం ఇవ్వలేదన్నారు. వెంటనే విద్యార్దులకు యూనిఫాంను సౌకర్యం కల్పించాలన్నారు. ప్రధానంగా వందలాది మంది విద్యార్ధులు ఉండే ఆశ్రమ పాఠశాలలు ఎక్కడ ఎక్కడో అడవులల్లో ఉండటంతో విద్యార్ధులు అనారోగ్యానికి గురైతే ప్రథమ చికిత్స చేయడానికి ఏఎన్ఎంలు లేక త్రీవ ఇబ్బందికి గురవుతున్నారన్నారు. వెంటనే ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని పాఠశాలలలో తరగతి గదులనే డార్మేటరిలుగా ఉపయోగిస్తున్నందున పిల్లలు చాలా ఇబ్బందులు పడుచున్నారన్నారు. సమస్యను పరిష్కరించాలన్నారు. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో ఉండే విద్యార్థులకు అనారోగ్యంతో ఏదైనా పెద్ద సమస్యకు గురైతే దూర ప్రాంతంలో ఉండే హాస్పిటల్ కు వెళ్ళడానికి ఒక వాహనం కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలల పాత బిల్డింగులు శిథిలావస్థలో ఉన్న స్థానములో నూతన బిల్డింగులు మంజూరు చేయాలన్నారు. ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఇతర ఎలక్ట్రికల్ సమస్యలు పునరుద్దరించాలన్నారు . తరగతి గదులకు, టాయిలెట్లకు డోర్స్ లేకపోవటంతో విద్యార్దులు చాలా ఇబ్బందులు పడుచున్నారన్నారు. పిల్లలు మధ్యాహ్న భోజన సమయంలో ఆహరం తీసుకునేందుకు డైనింగ్ హాలులో ఫర్నీచర్ ఏర్పాటు చేయాలన్నారు. వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని సీతక్క లేఖలో పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement