మరిపెడ, (ప్రభ న్యూస్): మానుకోట జిల్లాను గుడుంబా రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్ కోరారు. ఇవ్వాల (బుధవారం) సాయంత్రం మరిపెడ సీఐ ఆధ్వర్యంలో పాత నేరస్తులు, నల్లబెల్లం విక్రేతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. తొర్రుర్ డీఎస్పీ రఘుతో కలిసి ఈఎస్ కిరణ్ మాట్లాడారు. ఈజీ మనీ కోసం సారాయి అమ్మకం, నల్లబెల్లం రవాణా వంటి దందాకు పాల్పడితే ఇకమీదట పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నల్లబెల్లం వ్యాపారం చేసినా, రవాణాకు సహకరించినా కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా వారికి నల్లబెల్లం దందా వల్ల కలిగే దుష్పరినామాలు, పట్టుబడితే తీసుకునే చట్టపరమైన చర్యలపై కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
అక్రమ దందాకు పుల్‌స్టాప్ పెట్టాలే.. నల్లబెల్లం అమ్మితే పీడీయాక్టు నమోదు: ఈఎస్ కిరణ్
Advertisement
తాజా వార్తలు
Advertisement