ఏటూరునాగారం : లైంగిక వేధింపులు తాళలేక మహిళ ఓ వ్యక్తిని హత్య చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. లైంగికంగా వేధిస్తున్న రాంటెంకి శ్రీను (25)ను మండల కేంద్రానికి చెందిన జాడి సంగీత చేతుల కట్టేసి కత్తితో పొడిచి చంపింది. గత కొంత కాలంగా లైంగికంగా తన కోరిక తీర్చాలని సదరు మహిళను వేధిస్తున్నాడు రాంటెంకి శ్రీను. ఎన్నిసార్లు చెప్పినా అతడి తీరు మారడం లేదని మహిళా ఆగ్రహం చెందింది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో లైంగికంగా వేధిస్తుండగా కత్తితో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య చేసిన మహిళ నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లిందని స్థానికులు తెలిపారు.