ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : మానవీయ కథనాలను ప్రచురించడంలో సాటిలేని పత్రిక ఆంధ్రప్రభ అని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి కొనియాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో శుక్రవారం ఆంధ్రప్రభ 2022 నూతన క్యాలెండర్ ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ… ఆంధప్రభ చరిత్ర గొప్పదని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఆంధ్రప్రభ దినపత్రిక బ్రిటిష్ కు వ్యతిరేకంగా ఎన్నో కథనాలు రాసి పోరాటయోధులకు స్ఫూర్తినిచ్చిన చరిత్ర ఉందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఆంధప్రభ కీలక భూమిక పోషించిందని వారన్నారు. ఆంధ్రప్రభ తనదైన ఒరవడిలో వార్తలను ప్రచురిస్తూ అందరి మన్ననలను పొందుతుందన్నారు. గత మూడు పర్యాయాలుగా ఆంధ్రప్రభ క్యాలెండర్ ను తాను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా ప్రపంచాన్ని భయపెడుతున్న కాలంలో సైతం ఆంధ్రప్రభ దినపత్రిక ఒక్క రోజు కూడా ప్రచురణ నిలిచిపోకుండా జిల్లా ట్యాబ్ లాయిడ్ ను కొనసాగిస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ పాపుశెట్టి శ్రీనివాస్, భూపాలపల్లి రిపోర్టర్లు రాచర్ల ప్రభాకర్, బెల్లం తిరుపతి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొత్త హరిబాబు, తెరాస అర్బన్ అధ్యక్షులు కటకం జనార్ధన్, జిల్లా నాయకులు బుర్ర రమేష్ గౌడ్, క్యాతరాజు సాంబ మూర్తి, సెగ్గం సిద్ధు, తదితరులు పాల్గొన్నారు.
- వాస్తవ కథనాలు ప్రచురించడంలో సాటిలేనిది ఆంధ్రప్రభ
- ఆంధ్రప్రభ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన డీఎస్పీ సంపత్ రావు
వాస్తవ కథనాలు ప్రచురించడంలో ఆంధ్రప్రభ దినపత్రికకు సాటిలేదని భూపాలపల్లి డీఎస్పీ అవిర్నేని సంపత్ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీసు సబ్ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఆంధ్రప్రభ 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీజు వాసుదేవ రావు, ఎస్సై లు అభినన్, నరేష్, ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ పావుశెట్టి శ్రీనివాస్, రిపోర్టర్లు రాచర్ల ప్రభాకర్, బెల్లం తిరుపతి తదితరులు
పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital