మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అంగన్‌వాడీలకు వేతనాలు పెరిగి గౌరవం లభించిందని స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అంగన్‌వాడీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆర్సీవోలు, వీఓఏలతో మహబూబాబాద్ నిర్వహించిన ఆత్మీయ సమావేశాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్‌వాడీ సమస్యలపై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉందన్నారు. త్వరలోనే అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. అంగన్వాడీలు టీఆర్ఎస్ నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పల్లా గెలుపు పట్టభద్రులకు, ఉద్యోగులకు నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వానికి ఈ వర్గాల పట్ల మరింత నమ్మకాన్ని పెంచుతుందనిచెప్పారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, తెలంగాణ రాష్ట్ర అంగన్‌వాడీల రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాధవి, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షురాలు వాణి, మహబూబాబాద్ మెడికల్ అండ్ హెల్త్ కార్మిక విభాగం అధ్యక్షుడు నాగేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement