వరంగల్ జిల్లా గణపురం మండల కేంద్రంలో జీరో బడ్జెట్ లో మూవీ శరపంజరం షూటింగ్ ప్రారంభమైంది. కోట గూళ్లలో గణపతిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రోత్సహంతో ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ఈ మూవీలో కథానాయికగా లయ, కథానాయకుడు నవీన్ కుమార్ నటిస్తున్నారు.. తొలి రోజున వారిద్దరిపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.. ఈ మూవీకి దర్శకుడు నవీన్ కుమార్.. ఈ షూటింగ్ లో ప్రముఖ సంగీత దర్శకుడు మల్లిక్ ,కెమెరామెన్ మస్తాన్ సిరిపాటి, డ్రోన్ కెమెరా ప్రశాంత్,గౌరవ్ తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మల్లిక్ ఎంవికె మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా కళాకారులతో నిర్మిస్తున్న ఈ చిత్రం వరంగల్ పేరును జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తుందని అన్నారు . ఈ చిత్రం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల నేపథ్యం లో ఓ చక్కని ప్రేమ కథతో, కోన్ని జీవితాల కథ ఆధారంగా రూపోందించడం జరిగింది అని ఈ చిత్ర దర్శకుడు నవీన్ కుమార్ గట్టు తెలిపారు.. ఈ చిత్రంలో వరంగల్ బాష, ఆనంద్ భారతీ, జబర్దస్త్ వెంకీ, జబర్దస్త్ జీవన్, జబర్దస్త్ రాజమౌలి,మౌనశ్రీ మల్లిక్,మానుకోట ప్రసాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కళాకారులు నటిస్తున్నారు..