Thursday, September 19, 2024

వ‌రంగ‌ల్ జిల్లా నటీన‌టుల‌తో శ‌రపంజ‌రం షూటింగ్ ప్రారంభం…

వ‌రంగ‌ల్ జిల్లా గణపురం మండల కేంద్రంలో జీరో బడ్జెట్ లో మూవీ శరపంజరం షూటింగ్ ప్రారంభమైంది. కోట గూళ్లలో గణపతిరెడ్డి ఆధ్వ‌ర్యంలో తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రోత్సహంతో ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ఈ మూవీలో కథానాయికగా లయ, కథానాయకుడు నవీన్ కుమార్ న‌టిస్తున్నారు.. తొలి రోజున వారిద్దరిపై కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.. ఈ మూవీకి ద‌ర్శ‌కుడు నవీన్ కుమార్.. ఈ షూటింగ్ లో ప్రముఖ సంగీత దర్శకుడు మల్లిక్ ,కెమెరామెన్ మస్తాన్ సిరిపాటి, డ్రోన్ కెమెరా ప్రశాంత్,గౌరవ్ తదితరులు పాల్గొన్నారు, ఈ సంద‌ర్భంగా సంగీత దర్శకుడు మల్లిక్ ఎంవికె మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా కళాకారులతో నిర్మిస్తున్న ఈ చిత్రం వరంగల్ పేరును జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తుందని అన్నారు . ఈ చిత్రం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల నేపథ్యం లో ఓ చక్కని ప్రేమ కథతో, కోన్ని జీవితాల కథ ఆధారంగా రూపోందించడం జరిగింది అని ఈ చిత్ర దర్శకుడు నవీన్ కుమార్ గట్టు తెలిపారు.. ఈ చిత్రంలో వరంగల్ బాష, ఆనంద్ భారతీ, జబర్దస్త్ వెంకీ, జబర్దస్త్ జీవన్, జబర్దస్త్ రాజమౌలి,మౌనశ్రీ మల్లిక్,మానుకోట ప్రసాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కళాకారులు నటిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement