Tuesday, November 26, 2024

రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ..

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం పని చేస్తున్న దాదాపు 1000 మంది కార్మికులు, ఉద్యోగులు కలిసి రోడ్డు భద్రత అవగాహనలో భాగంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి ఎంజీఎం కూడలి మీదుగా హాస్పిటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండాలని, మైనర్ డ్రైవింగ్ చేయకూడదని, హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదన్నారు. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని స్లొగన్స్ ఇచ్చుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ట్రాఫిక్ ఇన్ స్పెక్ట‌ర్ బాబులాల్, ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ తమిలవనన్, ఎనివిరొన్నెంట్ అండ్ సేఫ్టీ ఇన్‌ఛార్జి సత్యనారాయణ రెడ్డి, ట్రాఫిక్ ఎస్పై డేవిడ్, ఆర్.ఎస్ఐలు పూర్ణచందర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement