Saturday, November 23, 2024

చాగల్లు వ‌ద్ద‌ రోడ్డు ప్రమాదం : మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రాజయ్య

జనగామ: నిత్యం ప్రజల సమస్యలపై పోరాటం చేసే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మరోసారి మానవత్వం చాటుకున్నారు..ప్రతి రోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో కష్టమొస్తే నేనున్నానంటూ భరోసాను కలిపిస్తున్నారు తాటికొండ రాజయ్య.. వివరాలకెళ్ళితే..జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్లు జాతీయ రహదారి పై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ గ్రామానికి చెందిన శెట్టే లింగమ్మ, రామచంద్రయ్య,లలితకు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ట్రాక్టర్ డికోట్టింది.. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలయ్యాయి.. అదే సమయంలో అటుగా రఘునాధ్ పల్లి మండలంలోని అధికార కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఎమ్మెల్యే రాజయ్య రోడ్డు ప్రమాదాన్ని గమనించి మానవతా దృక్పథంతో స్పందించారు.. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపి ఘటనా స్థలికి వెళ్లారు.. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను ప్రైవేట్ వెహికిల్ అరేంజ్ చేసి హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి ఎమ్మెల్యే రాజయ్య తన మానవత్వాన్ని మరో చాటుకున్నారు.
క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించండి… ఎమ్మెల్యే రాజయ్య
డివిజన్ కేంద్రంలోని ఎస్ఎస్ కే హస్పటిల్ ను వెంటనే సందర్శించారు. రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆపదలో ఉన్న వ్యక్తులను ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రాజయ్యను స్థానికులు ప్రశంసిస్తున్నారు.ఎమ్మెల్యే చొరవను అందరూ అభినందించారు.వారితో క్యాంపు ఆఫీస్ ఇంచార్జ్ ఆకుల కుమార్, సీఐ ఏడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఐ శ్రవణ్ కుమార్, సర్పంచ్ సారంగపాణి, ఎంపీటీసీ కనకం స్వరూప గణేష్, నాయకులు గడ్డమిది వెంకటస్వామి, స్థానికులు నాగరాజు, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement