Friday, November 22, 2024

బిజెపి, టిఆర్ ఎస్ లు వరంగ‌ల్ కోసం ఏం చేశాయి…. నిల‌దీసిన రేవంత్ రెడ్డి

వ‌రంగ‌ల్ – బిజెపి, టిఆర్ ఎస్ లు ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివార‌ని విమ‌ర్శించారు తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిండెంట్ , ఎంపి రేవంత్ రెడ్డి..అభివృద్ధి చేస్తామ‌ని బిజెపి అంటుంద‌ని, అస‌లు అభివృద్ధి అంతా మేమే చేశామ‌ని టిఆర్ ఎస్ చెప్పుకుంటుంద‌ని, అయితే వ‌రంగ‌ల్ లో అభివృద్ధి ఎక్క‌డ ఉంద‌ని ప్ర‌శ్నించారు.. వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ అభ్య‌ర్దుల త‌రుపున ప్ర‌చారానికి వ‌చ్చిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఒక‌రిది మాట‌లు చెప్పే పార్టీ అయితే మ‌రోక‌రికి కోత‌ల పార్టీ అంటూ విరుచుకుప‌డ్డారు.. కాజీపేట‌కు రైలు కోచ్ ఫ్యాక్ట‌రీని పున‌ర్వీభ‌జ‌న చ‌ట్టం ద్వారా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.. కేంద్రంలో ఉన్న బిజెపి గానీ, రాష్ట్రంలో ఉన్న‌టిఆర్ ఎస్ గానీ కోచ్ ఫ్యాక్ట‌రీని ఇంత వ‌ర‌కు ఎందుకు తీసుకురాలేక‌పోయార‌ని నిల‌దీశారు.. టెక్స్ టైల్ పార్క్ ,ఐటీ పార్క్, డంపింగ్ యార్డ్ నిర్లక్ష్యం కీ టీఆర్ఎస్ కారణం కాదా? అంటూ ప్ర‌శ్నించారు.. ఎన్నికలలో గెలవాలనే చూస్తున్నారు కానీ…అభివృద్ధి ఏమీ చేసారని అన్నారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా వరంగల్ నగరానికి ప్రసంగాలు తప్పా ఏం ఇచ్చార‌ని మండిప‌డ్డారు.. కరోనాతో చాలా మంది మృతి చెందుతున్నార‌ని..కరోనా కట్టడిలో రెండు ప్రభుత్వాలు విఫలమ‌య్యాయ‌ని అన్నారు.. ప్రధానీ మోడీ కరోనా విషయంలో నిర్లక్ష్యం చేయడం వలన చాలా మంది చనిపోయార‌ని అన్నారు.. క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంటుంద‌ని హెచ్చ‌రిక‌లు వ‌చ్చినా టీఆర్ఎస్,బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోద‌ని మండి ప‌డ్డారు.. చనిపోతే స్మశానవాటిక కూడా ఏర్పాటు చేయలేని దుస్తీతిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందంటూ ఫైర్ అయ్యారు.. కరోనా వైద్యంలో నిర్లక్ష్యం చేసిన నాయకులకు ఓటే వేయద్ద‌ని పిలుపు ఇచ్చారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement