Monday, November 25, 2024

WGL: వరంగల్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అక్రమ నిర్మాణం తొలగింపు

వరంగల్ (కార్పొరేషన్): బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఆఫీస్ కొరకు వరంగల్‌లోని పుల్లయ్య కుంట లోస్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో అక్రమ నిర్మాణం జరిగిందని సామాజికవేత్తలు ఫ‌సితో పాటు బిఆర్‌ఎస్ కార్య కర్తలు బల్దియా అధికారులకు , పోలీసులకు ఫిర్యాదు చేయగా వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ రిజ్వాన్ బాషా చీప్ సిటీ ప్లానర్ బానోతు వెంకన్న నేతృత్వం లో… టౌన్ ప్లానింగ్ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం తెల్ల వారూ జామున అక్రమ నిర్మాణాన్ని తొలగించారు.

అక్రమ నిర్మాణాలపై బల్దియా అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. అలాగే హనుమకొండ కాపు సంఘం కాలనీలో మరో అక్రమ నిర్మాణం చేపట్టిన అశోక్ భవన నిర్మాణ అనుమతిని పొంది నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించడంతో అట్టి నిర్మాణాన్ని సైతం అధికారులు తొలగించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీలు శ్రీనివాస్ రెడ్డి ,ఖలీల్, శ్రీనివాస్ , టీపీఓ లు సుష్మా ,బషీర్, టిపిఎస్ లు అవినాష్ సంధ్యారాణి, చైన్ మేన్లు బల్దియా డి ఆర్ ఎఫ్ సిబ్బంది ,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement