Tuesday, November 26, 2024

పీజీ మెడికల్ ప్రవేశాలకు అదనపు మాప్ ఆఫ్ నోటిఫికేషన్ విడుదల

వరంగల్ : పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం అదనపు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యింది. హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలకు, అదేవిధంగా నిమ్స్ మెడికల్ కళాశాలలో ఖాళీ గా ఉన్న కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈనెల 29వ తేది సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేది మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొంది. గత విడత కౌన్సెలింగ్ లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కంటిన్యూ చేసినా, అల్ ఇండియా కోటాలో ఇప్పటికే చేరినా, విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కు అనర్హులని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement