Tuesday, November 26, 2024

రామప్ప మత్తడి వెడల్పు చేయాలి : ఎమ్మెల్యే సీత‌క్క‌

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రామప్ప చెరువుతో పాటు ఇతర చెరువులు వరుదలో పూర్తి స్థాయిలో నిడటం జరిగిందని, ముఖ్యంగా రామప్ప చెరువు మత్తడి వెడల్పు చేయాలి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రామప్ప చెరువు తూము, మత్తడిని బుర్గు పేట మారేడు గుండ చెరువుని ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రామప్ప దేవాలయంలో వాన నీరు చేరుతుంది.. రామప్ప చెరువు చుట్టూ ఉన్న ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీటి మయం అయి రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాలని, ఇండ్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా 25 వేలతో పాటు డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్ టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, మండల అధ్యక్షులు చెన్నోజు సూర్య నారాయణ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, ఎంపీటీసీ బానోత్ భాస్కర్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడు వీరేశ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గణేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సుమన్ రెడ్డి, సహకార సంఘం వైస్ చైర్మన్ రాజేందర్,ఉప సర్పంచ్ మర్క జయశంకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు కొండ తిరుపతి, జనగాం నాగరాజు, కొలకాని నర్సయ్య, గోపాల్ప వన్, గజవెని రమేష్, సంజీవ, రవి, సహకార సంఘం డైరెక్టర్ రజీనికర్, ఖాజా కమృద్దిన్, సమ్మయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement