Tuesday, November 26, 2024

అగ్నిపథ్ ఆందోళనలో రాకేష్ మృతి బాధాకరం : డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ : అగ్నిపథ్ ఆందోళనలో రాకేష్ మృతి బాధాకరమ‌ని, అతని మృతికి టీఆర్ ఎస్ రాజకీయం చేయడం సిగ్గుచేట‌ని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. నివాళి అర్పించడానికి ప్రతిపక్షాలకు కనీసం అవకాశం ఇవ్వకుండా గృహ నిర్బంధం చేశారు.. గృహ నిర్బంధం చేయడం ఈమధ్య ఫ్యాషన్ అయ్యింద‌న్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇవ్వడం చేతకాదు, రాష్ట్ర ప్రభుత్వానికి భద్రత ఇవ్వడం చేతకాద‌న్నారు. డెడ్ బాడీ చూసే స్వేచ్ఛ ప్రతిపక్షాలకు లేదా….? రాకేష్ ది ముమ్మాటికీ టీఆర్ ఎస్ హత్య.. మీరే హత్య చేసి మీరే ర్యాలీ చేస్తారా అని మండిప‌డ్డారు. రాబోయే రోజుల్లో టీఆర్ ఎస్, బీజేపీ నాయకులను ప్రజలు ఊర్లలో తిరగనివ్వర‌ని, మీడియా సోదరులు, విద్యార్థులు, మేధావులు బయటికి వచ్చి మద్దతు ఇవ్వాల‌న్నారు. టీఆర్ ఎస్ వాళ్ళు ఏది చెపితే అది చేయడం పోలీసులు మానుకోవాలి.. లేకపోతే మా దారిలో మేము వెళ్తామ‌న్నారు. మృతుని కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని డీసీసీ అధ్య‌క్షుడు నాయిని రాజేంద‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement