వరంగల్ రైల్వే స్టేషన్ లోని రైల్వే గూడ్స్ షెడ్ లో వరంగల్ సౌత్ సెంట్రల్ రైల్వే షావుకారి హమాలీ యూనియన్ వారు గూడ్స్ షెడ్ చింతలపల్లికి తరలింపుపై, అందులో పనిచేస్తున్న 225 మంది హమాలీలు జీవనోపాధి కోల్పోతాము అని ఎమ్మెల్యే నరేందర్ కి తమ బాధను వెల్లబోసుకున్నారు. చింతలపల్లికి తరలించిన యెడల మాకు అందులో ఉపాధి కల్పించేలా కృషి చేయాలని కోరారు. వారి సమస్యల పట్ల ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. మీకు తోడుగా ఉంటా.. అవసరమైతే మీకు న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నాను అన్నారు. మీకు తోడుగా ఉంటా, మీ కష్టాలపై నేను కొట్లాడ్తాను అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిడ్డి కుమార స్వామి, సోమిశెట్టి ప్రవీణ్, జడ్ఆర్సి మెంబెర్ చింతాకుల సునీల్, యూనియన్ అధ్యక్షులు కక్కే సారయ్య, అధ్యక్షులు అయూబ్ ఖాన్, శివ, రాజశేఖర్, హరి, దేవేందర్ యూనియన్ హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.