భూపాలపల్లి: కొత్త ఓటర్లకు త్వరగా ఏపిక్ కార్డులను అందించేలా చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ఎలక్షన్ సీఈఓ శశాంక్ గోయల్ బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ… స్పెషల్ సమ్మరీ రివిజన్ 2022 ద్వారా నూతన ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు పూర్తి చేసి చివరి ఓటరు జాబితాను ప్రకటించడం జరిగిందన్నారు. నూతన ఓటర్లుగా నమోదైన వారికి జిల్లాల వారీగా ఏపిక్ కార్డులను అందించడం జరుగుతుందని, ఆయా కార్డులు నూతన ఓటర్లకు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా గరుడ, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ తెలిసేలా ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, తదితరుల సహకారంతో విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో నూతనంగా నమోదైన ఓటర్లకు త్వరగా ఏపిక్ కార్డులు అందేలా చర్యలు చేపడతామని, నూతనంగా నిర్మించిన ఈవీఎం గోడౌన్ లోకి వారం రోజుల్లోగా ఈవీఎంలను షిఫ్ట్ చేస్తామన్నారు. అన్ని శాఖల సహకారంతో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీవో శ్రీనివాస్, ఎలక్షన్ టెక్నికల్ పర్సన్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital