మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినీలు ఆందోళన చేస్తున్నారు. ఉదయం టిఫిన్ మానివేసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. వార్డెన్ మేడంకు బదులు వారి భర్త వచ్చి పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినీలు ఆరోపించారు. మెనుచార్టు పాటించడం లేదని, వసతి గృహంలో ఉన్నా సమస్యలను పట్టించుకోకుండా 40 క్వింటాల బియ్యం అమ్ముకున్నారని తన భర్త రాత్రి వేళలో కూడా హాస్టల్లోకి వస్తున్నారని ఆరోపించారు. అనంతరం ఆశ్రమ పాఠశాల గేటు ముందు విద్యార్థులు కూర్చొని నిరసన కొనసాగిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల పిల్లలు అయితేనే మినరల్ వాటర్ తాగుతారని.. మీకు మినరల్ వాటర్ పోసేది లేదని, తమను పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ చేయిస్తానని బెదిరింపులు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement