Friday, November 22, 2024

ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ : నగర మేయర్ గుండు సుధారాణి

తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ అని
నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. శనివారం ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి మేయర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భం గా మేయర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టం సాధించాలనే సంకల్పం తో నాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పట్ల కోనసాగుతున్న వివక్షను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారన్నారు. రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ స్ఫూర్తి ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసిందని, స్వరాష్టం సాధించాలని నిరంతరం పరితపించారని, మలి తెలంగాణ ఉద్యమం లో ఆయన పాత్ర మరువలేనిదని, ఉద్యమ కారుడి నుండి మహోపాధ్యాయుడి వరకు ఆయన తెలంగాణకు దిక్సూచి గా నిలిచారన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తి కి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ఈ సందర్భం గా ఉద్యోగులు, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ అనిస్ ఉర్ రషీద్, సిపి వెంకన్న, ఎస్ ఈ సత్యనారాయణ, సెక్రెటరీ విజయలక్ష్మి, పీఆర్ఓ ఆయుబ్ అలీ, ఈఈ శ్రీనివాస్ ,ఎంహెచ్ ఓ రాజేష్, డిసిపి ప్రకాష్ రెడ్డి, ఏసీ అధ్యక్షులు గౌరీ శంకర్, డీఈలు, ఆర్ఓలు అన్ని విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement