Tuesday, November 26, 2024

కమ్యూనిస్టుల పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం : సీపీఐ నేత శ్రీనివాస రావు

హనుమకొండ : కమ్యూనిస్టుల పోరాటాలతోనే సమస్యల పరిష్కారం సాద్యం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శాయంపేట మండలానికి చెందిన 50 మంది యువకులు సీపీఐలో చేరారు. ఈ సందర్భంగా వారికి సీపీఐ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి సీపీఐ నాయకులు ఆహ్వానించారు. అనంతరం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో తక్కళ్లపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నది కమ్యూనిస్టులేనని అన్నారు. ఇతర బూర్జువా పార్టీలకు ఓట్లు, సీట్లు మాత్రమే కావాలని, కానీ కమ్యూనిస్టులు సమసమాజ స్థాపనే లక్ష్యంగా పని చేస్తారని అన్నారు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా, నిరుద్యోగ, కార్మిక, కర్షక, మహిళల, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని కోరారు. పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాల సాధించే వరకూ సిపిఐ భూపోరాటాలు నిర్వహిస్తూనే ఉంటుందని అన్నారు. సిపిఐ జెండా గ్రామ గ్రామాన ఎగురవేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, నాయకులు నేదునూరి రాజమౌళి,మారుపాక అనిల్ కుమార్, కొట్టెపాక రవి, కండె నర్సయ్య,బత్తిని సదానందం, అనుకారి అశోక్, మారపెల్లి క్రాంతి కుమార్, అరికిల్ల దేవయ్య, గుంటి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దేవయ్య,క్రాంతి కుమార్ ఆద్వర్యంలో శాయంపేట మండలానికి చెందిన జోగి రమేష్,పోలెపాక ప్రసాద్,జోగి కన్నయ్య, కె.శ్రీకాంత్, చల్లా సూర్య ప్రకాశ్, మోరె రవి, చింతల స్వామి, బాసాని భాస్కర్,రాజు,సారయ్య,వెంకన్న,అశోక్ తదితరులు సిపిఐ లో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement