Tuesday, November 26, 2024

ప్రధాని మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ : ప్రధాని మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌ విధానం తీసుకొచ్చి దేశరక్షణతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీఎం దవాఖాన వద్ద రాకేశ్‌ మృతదేహాని మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మోదీ రైతులకు క్షమాపణలు చెప్పినట్లే యవతకూ చెప్పాలన్నారు. అగ్నిపథ్‌ ఆందోళనల్లో రాకేశ్‌ మృతిచెందడం చాలా బాధాకరమని వెల్లడించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సైన్యంలో ఔట్‌సోర్సింగ్‌ విధానం తీసుకురావడం దారుణమని విమర్శించారు.

సైనికులను చంపి భావోద్వేగాలతో గెలవాలని మోదీ చూస్తున్నారని ఆరోపించారు. మోదీ విధానాలతో దేశం ఇప్పటికే నాశనమైపోయిందని చెప్పారు. ప్రతిరంగాన్ని ప్రైవేటీకరించి, అమ్మేస్తున్నారని వెల్లడించారు. అనేక ప్రజావ్యతిరేక విధానాలతో రైతులకు తీవ్ర నష్టం చేశారని విమర్శించారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడితే తరిమికొడుతామని హెచ్చరించారు. అగ్నిపథ్‌ను రద్దు చేసేవరకు పోరాడుతామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement