వరంగల్ /హైదరాబాద్ – నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న కేఎంసీ విద్యార్థిని తాజా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్ నిమ్స్ కు వెళ్లారు. మరోవైపు విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడు సైఫ్‌ను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యాహ్నం మీడియా ముందు సైప్‌ను ప్రవేశ పెట్టనున్నారు.. కాగా, ప్రీతి ఆరోగ్య పరిస్థితిని మంత్రి రాథోడ్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.. ప్రీతి ఆరోగ్యం గతం కంటే కొంచెం బెటర్ గా ఉందని తెలిపారు.. నిమ్స్ వైద్యులు ప్రీతికి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్లు సత్యవతి వెల్లడించారు.. ప్రీతికి మెరుగైన వైద్య చికిత్స అందించాలంటూ ఆదేశించారు. ప్రీతి తల్లి తండ్రులతో మాట్లాడి వారిని ఓదార్చారు మంత్రి. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వైద్య విద్యార్థిని ప్రీతి సంఘటన బాధాకరమన్నారు. ఎక్మా,డయాలసిస్ ల సాయంతో ప్రీతీకి చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. ప్రీతీ కళ్ళు తెరిచి చూడగలుగుతుందని, స్వతహాగా ఊపిరి తీసుకోగలుగుతుందని పేర్కొన్నారు… కాగా, MGM లో ర్యాగింగ్ ఘటనపై విచారణకు ప్రభుత్వం కమిటీని నియమించిందన్నారు. ఘటన కారకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడు సైఫ్ ను వరంగల్ లో అరెస్టు చేశారు. ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడైన సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ర్యాగింగ్ కేసు నమోదు చేశారు. నిందితునిపై క్రైమ్ నంబర్ 69/2023 అండర్ సెక్షన్ 306 ఆర్/డబ్ల్యు 108 , 354 ఆఫ్ ఐపిసి, 4(వి) ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్, 3(1)(ఆర్), 3 (2)(వి ఏ),3 (1)(డబ్ల్యు)(ii) ఆఫ్ సెక్షన్ ఎస్సీ,ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడు సైఫ్ ను అరెస్ట్ చేశారు.