Friday, November 22, 2024

పీఆర్సీ ప్రకటన – కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

కేసముద్రం, ఉద్యోగుల పాలిట కల్ప వృక్షం తెలంగాణ ప్రభుత్వమని, ఇచ్చిన మాట ప్రకారం పీఆర్సీ ని ప్రకటించి మాటను నిలుపుకున్న సీఎం కేసీఆర్ అని కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి నారాయణ రావు కొనియాడారు. సోమవారం సీఎం కేసీఆర్ అందించిన తీపికబురుతో సంబురాల్లో ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి కేసీఆర్ చిత్ర పటానికి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ రావు, కేసముద్రం పట్టణ సర్పంచ్ అండ్ మార్కెట్ డైరెక్టర్ బట్టు శ్రీనివాస్ తో కలిసి పాలాభిషేకం చేశారు. ఈసందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ సాధనలో అలుపెరుగని పోరాటాలు చేసిన ప్రభుత్వ , కాంట్రాక్ట్, పొరుగు సేవల ఉద్యోగుల పక్షాన సీఎం కేసీఆర్ నిలిచారనడానికి 11 వ వేతన సవరణ ద్వారా ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచడాన్ని ఉద్యోగ సంఘాలు హర్షిస్తున్నాయని చైర్మన్ నారాయణ రావు అన్నారు. తెలంగాణ సాధన, అభివృద్ధి లో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైన తెలంగాణ ప్రభుత్వంతోనే ఉద్యోగులు ఉన్నారని అన్నారు. ఉద్యోగుల బాధను అర్థం చేసుకొని పీఆర్సీ, ఉద్యోగుల వయో పరిమితి పెంపు, విరమణ పొందిన ఉద్యోగులు అదనపు పెన్షన్ పొందుటకు వయో పరిమితిని 75 నుండి 70 కు కుదించటాన్ని హర్షిస్తున్నామని అన్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, హోంగార్డులు వీఆర్ ఏలు, అంగన్ వాడి, ఆశా వర్కర్లకు పీఆర్సీ వర్తింపు చేయడం, ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు తీపి కబురు తెలిపిన సీఎం కేసీఆర్ ఈ సందర్బంగా చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏప్రిల్ 1, 2021 నుండి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సంకపల్లి జనార్దన్ రెడ్డి, సూపర్ర్వైజర్ రాజేందర్, సెక్రటరీ రాజా, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిదంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రోజారాణి ఆధ్వర్యంలో ఉద్యోగస్తులతో కలిసి సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement