Monday, November 25, 2024

WGL: తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం సరైంది కాదు…

ప్రభ న్యూస్, దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని కామారెడ్డి గూడెం దళితవాడలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం రాజకీయ రంగు పూలుముకుంది. వివరాల్లోకి వెళితే.. ఆ విగ్రహాన్ని బీఆర్ఎస్ నేత చింత రవి ఏర్పాటు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు విగ్రహానికి పర్మిషన్ లేదని, గ్రామపంచాయతీ సిబ్బందితో కూలగొట్టించేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు.

అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రామిరెడ్డి మాట్లాడుతూ…. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం చేయడం సరైనది కాదన్నారు. ఇప్పటికైనా విగ్రహాన్ని కూల్చే ప్రయత్నాన్ని మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి విగ్రహాన్ని కూల్చే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement