వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్) : వరంగల్ పోలీస్ కమీషనరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవిన్స్ ను కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సోమ వారం అనగా ఈనెల 31వ,తేదీన నిర్వహించలేక పోతున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు.
ఈనెల 31వ,తేదీన నిర్వహించాల్సిన పోలీస్ గ్రీవిన్స్ ను ఆగస్టు ఒకటవ తేదీ అనగా మంగళవారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాధితులెవ్వరు సోమవారం పోలీస్ కమీషనరేట్ కార్యాలయం కు వచ్చి ఇబ్బందులు పడవద్దన్నారు. కావున ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను అందజేసేందుకు పోలీస్ కమీషనరేట్ కార్యాలయమునకు మంగళవారం వచ్చి ఫిర్యాదులు అందజేయవచ్చునని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ తెలిపారు.