Saturday, November 23, 2024

కామన్ పెల్లిలో పోలీసుల కార్డన్ సెర్చ్

పలిమెల : జయశంకర్ భూపాలపెల్లి జిల్లా పలిమెల మండలం కామన్ పెల్లి గ్రామంలో ఈ రోజు ఎస్ఐ అరుణ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మండలంలోని కామన్ పెల్లి గ్రామంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం గ్రామస్థులతో మాట్లాడుతూ… గుట్కా, గ్యాంబ్లింగ్, గుడుంబా, గంజాయి వంటి నిషేధిత పదార్థాలను అమ్మడం కానీ, రవాణా కానీ, నిల్వ ఉంచడం కానీ చట్ట రీత్యా నేరం.. కావున వాటికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకి తెలియజేయాలని గ్రామస్థులకు సూచించారు. మండల పరిధిలో గల ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాలకి సన్నద్ధమౌతున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే ప్రభుత్వం విడుదల చేసిన ఇ-నోటిఫికేషన్ కి ప్రణాళిక బద్దంగా చదివి ఉద్యోగం సాధించాలని, సమయాన్ని వృధా చేయకుండా ప్రిపరేషన్ ని కొనసాగించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. అలాగే బయటి నుండి వచ్చే వ్యక్తులకి ఆశ్రయం కల్పించవద్దని, కొత్త అనుమానిత వ్యక్తులు ఎవరైనా వస్తే సమాచారం అందించాలని సూచించడం జరిగింది. ఎవరైనా చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడినట్లు అయితే కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అరుణ్, పలిమెల పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement