మరిపెడ : ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రులు జరుపుకోవాలని, తొర్రుర్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలకు ఆన్‌లైన్ ద్వారా అనుమతి తీసుకుని నమోదు చేసుకోవాలని తొర్రుర్ డీఎస్పీ ఏ.రఘు, ఆర్డీవో రమేష్ తెలిపారు. గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో దూలం పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల కమిటీలకు, నిర్వాహకులకు ఆయా శాఖల అధికారులతో సలహాలు, సూచనలు కల్పించే అవగాహన సమావేశానికి ఆర్డీవో, సీఐ ఎన్ సాగర్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా విపత్తు అనంతరం పూర్తి స్థాయిలో వినాయక నవరాత్రులు జరుపుకుంటున్నామని, ప్రజలంతా కలిసి మెలసి కుల, మతాలకు అతీతంగా ఈ ఉత్సవాలను ప్రతి ఏటా జరుపుకుంటారన్నారు. ఈ ఏడాది గతంలో కన్నా అత్యధికంగా వినాయక మండపాలు ఏర్పాటు చేయటం జరిగిందని, వినాయక మండపాలు ఏర్పాటు చేసే ఆయా కమిటీలు, నిర్వాహకులు ప్రభుత్వ వెబ్‌సైట్ https://policeportel.tspolice.gov.in/ ద్వారా అనుమతి పొంది నమోదు చేసుకోవాలని సూచించారు. అలా నమోదు చేసుకోని వారి కమిటీకి ఎలాంటి గుర్తింపు ఉండదని, డివిజన్ పరిధిలో ఆయా కమిటీలు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకుంటే పోలీసు, రెవెన్యూ, విద్యుత్, అగ్నిమాపక శాఖలకు పూర్తి సమాచారం అందుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement