పెండింగ్ ఉపకార వేతనాలు వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల తో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో వివిధ విద్యా సంస్థల్లో చదువు తున్న విద్యార్థులు వారు ధరఖాస్తు చేసుకున్న ఉపకార వేతనాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆధార్ అనుసంధానం, యూఐడి, వెరిఫికషన్, బ్యాంక్ అకౌంట్, బయోమెట్రిక్ తదితర సాంకేతిక సమస్యలు వచ్చిన వెంటనే తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మార్చి నెలలోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇంకా 788 ఉపకార వేతనాలు వివిధ రకాల సమస్యలతో పెండింగ్ లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. అర్హత కలిగిన ప్రతివిద్యార్థికీ ఉపకారవేతనం అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల, శ్యామ్ కుమార్, ఇందిర దేవి, కిరణ్మయి, లక్ష్మయ్య, దివాకర్, శ్రీనివాస్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్లు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement