Friday, November 22, 2024

WGL | తవ్వకాలలో బయటపడిన పెద్దమ్మ తల్లి విగ్రహం

భారీగా తరలివచ్చిన భక్తులు


కరీమాబాద్, అక్టోబర్ 29 (ఆంధ్రప్రభ) : వరంగల్ జిల్లా ములుగు రోడ్డు ఇండస్ట్రియల్ ఏరియాలో జరుగుతున్న తవ్వకాల్లో బయటపడిన పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని మంగళవారం బీజేపీ నాయకులు, భక్తులు దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ… పురాతన విగ్రహాల వద్ద నాగసర్పాలు ఉన్నాయంటే సుమారు 1000 సంవత్సరాల పురాతనమైనవిగా చరిత్ర చెబుతుందన్నారు. కాకతీయులు ఓరుగల్లును పరిపాలించే సమయంలో మొదటి నుండి చిట్టచివరి గణపతి దేవుడు వారు శైవమతాన్ని, శివుడిని, అమ్మవారిని పూజించిన చరిత్ర మనకు ఉంది. ఓరుగల్లులో భద్రకాళి అమ్మవారు, హన్మకొండలో హనుమద్గిరి పద్మాక్షి అమ్మవార్లు వున్నారు.

గతంలో పెద్దమ్మ గడ్డ పేరు వచ్చిందంటే పెద్దమ్మ తల్లి దేవాలయం ఉండేదని చరిత్ర చెప్తుంది. ఇప్పుడు ఈ భూమి తవ్వాకల్లో ఆ పెద్దమ్మ తల్లి విగ్రహం బయటపడింది. మనకి ఎక్కడికి వెళ్లినా అడుగడుగునా శివలింగాలు, అమ్మవారి విగ్రహాలు వున్నాయి. నగరంలో ఒక వైపు భద్రకాళి అమ్మవారు, మరో వైపు పద్మాక్షి అమ్మవారు, మధ్యలో పెద్దమ్మ తల్లి. నగరంలో ఎలాంటి దుష్టశక్తులు రాకుండా నగర ప్రజలను కాపాడుతూ సుఖ సంతోషాలతో జీవించడానికి ఉండేవారని గంట రవికుమార్ అన్నారు.

- Advertisement -

అలాంటి పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఒక చోటపెట్టి గుడిని ప్రతిష్టిచాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, గడల కుమార్, మాచర్ల దీన్ దయాల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎర్రగోళ్ల భరత్ వీర్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు సోమేశ్వర్ వర్మ, 23వ డివిజన్ అధ్యక్షులు తోట సురేష్, బీజేపీ జిల్లా నాయకులు ముండ్రాతి వెంకటేశ్వర్లు, మల్లికార్జున్, బీజేవైఎం నాయకులు శరత్, పవన్, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement