భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు సోమవారం పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇన్వెస్టర్స్ వెల్ఫైర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖాతాదారులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కస్టమర్లకు చెల్లించవలసిన చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ లోధా కమిటీ, సెబి నిర్లక్ష వైఖరిని కండిస్తూ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పీఏసీఎల్ కంపెనీ కలెక్టివ్ ఇన్వెస్ట మెంట్ స్కీమ్ ద్వారా వ్యాపారం చేస్తుందని అభియోగంతో సెబీ దేశవ్యాప్తంగా ఆ కంపెనీ లావాదేవీలు నిలిపివేసింది. దీంతో కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఖాతాదారులు రోడ్డున పడ్డారు. దీనిపై సుప్రీంకోర్టు పీఏసీఎల్ కంపెనీ ఆస్తులు అమ్మి ఖాతాదారులకు తిరిగి డబ్బులు చెల్లించడానికి రిటైర్డ్ జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసిందని, కానీ కమిటీ దీనిపై నిర్లక్ష్యం వహిస్తూ… ఆరు సంవత్సరాలుగా ఖాతాదారులకు చెల్లింపులు జరపకుండా కాలయాపన చేస్తున్నారని, ఇకనైనా కమిటీ నిర్లక్ష్యం వీడి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement