వరంగల్ క్రైమ్ ఏప్రిల్ 20 (ప్రభ న్యూస్) : వరంగల్ బస్టాండ్ లో ప్రమాదవశాత్తు వెనుక టైరు కింద పడి ఒకరు మృతి చెందారు. మృతుడి తల పగిలి చనిపోయాడు. సంఘటన స్థలంలోని సీన్ చూస్తే బస్సు వ్యక్తి మీద నుండి పోయినట్టు లేదు. బస్సును వెనుకకు తీసే క్రమంలో ప్రయాణీకుడికి తగిలి కింద పడటం వల్ల తల పగిలి మృతి చెంది ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ గుర్తు తెలియని వ్యక్తి మృతితో ఆగ్రహోదకులైన ప్యాసింజర్స్ బస్టాండ్ లో నిలిచి ఉన్న బస్సులపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. ఐదారు ఆర్టీసీ బస్సుల అద్దాలు మిగిలిపోయాయి. వెనుక టైరు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణీకులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ తీరును నిరశిస్తూ ఆందోళనకు దిగారు. ఆర్టీసీకి వ్యతిరేకంగా వరంగల్ బస్టాండ్ లో నినాదాలు చేస్తూ అర గంటకు పైగా హంగామా చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి, పరిస్థితిని చక్క దిద్దారు. ఘటనకు సంబంధించి అన్ని కోణంలో ఇంతేజార్ గంజ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.