తొర్రూరు : మండలంలోని హరిపిరాల గ్రామంలో శతాధిక వృద్ధురాలు రాయిపెల్లి లచ్చమ్మ(102) శుక్రవారం వయోభారంతో మృతి చెందారు. భర్త రాయిపెల్లి మల్లయ్య 30 ఏళ్ల క్రితమే మరణించగా… వృద్ధురాలికి ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. పురాణాలు, రామాయణం, భాగవతం, బ్రహ్మంగారి చరిత్ర ఇతరత్రా అన్నీ పిల్లలకు అర్థవంతంగా వివరిస్తూ గ్రామంలో అందరికీ ఆదర్శంగా ఉన్నారు. అయితే ఆమె చనిపోవడంతో ఆమె మృత దేహనికి గ్రామ పెద్దలు పూలమాల వేసి సంతాపం తెలిపారు. గ్రామంలో 102 ఏళ్లు జీవించిన తొలి కురువృద్ధురాలిగా నిలిచారని గ్రామపెద్దలు తెలిపారు. 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. చనిపోయే వరకు తన పని తానే చేసుకునేవారన్నారు. లచ్చమ్మ కుటుంబ సభ్యులు 150 మంది ఉండగా.. ఆమె 3 తరాలను చూసిందని గ్రామస్తులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement