వరంగల్, ప్రభన్యూస్ ప్రతినిధి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పీబీబీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిశ్వవిద్యాలయం నోటిఫి కేషన్ విడుదల చేసింది. ఈనెల 23వ తేది ఉదయం 9 గంటల నుంచి అక్టోబర్ 3వ తేది సాయంత్రం 6 గంటల వరకు అర్హులైన వి ద్యార్దులు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నది. నాలుగేళ్ల బ్యాచలర్ ఆఫ్ నర్సింగ్ (బీఎస్సీనర్సింగ్), రెండు సంవత్సరాల పోస్టుబ్యాచ్‌లరఫ్ నర్సింగ్ (పీబీబీ ఎస్సీ), బ్యాచలరఫ్ ఫిజియోథెరఫీ (బీపీటీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ యూనివర్సిటి గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోని ఈ నోటిఫికేషన్ ద్వారా కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేస్తారు.
అర్హులైన విద్యార్దులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని యూనివర్సిటి ఒక ప్రకటనలో పేర్కొన్నది. ధృవపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను యూనివర్సిటీ ప్రకటిస్తుంది. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని కాళోజీ యూనివర్సిటీ వర్గాలు తెలుపాయి.