వరంగల్, ప్రభన్యూస్ ప్రతినిధి: బీఎస్సీ నర్సింగ్, పోస్టుబేసిక్ నర్సింగ్, బీపీటీ కోర్సులకు గత ఏడాది మాదిరిగానే ప్రవేశాలు ఉంటాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. ఈ కోర్సుల్లో ఇప్పటికే యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులకు అక్టోబర్ 3వ తేది గడువు విధించింది.
ఆయా కోర్సుల్లో చేరేందుకు ప్రవేశపరీక్షలు నిర్వహించలేదని, గతంలో ఏవిధంగా కౌన్సిల్ నిర్వహించారో.. ఈ ఏడాది కూడా అదే తరహాలో ప్రవేశాలు ఉంటాయని యూనివర్సిటీ శనివారం నాడు ప్రకటన జారీ చేసింది. అర్హత ఇతర వివరాల కోసం నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్‌ను చూడాలని యూనివర్సిటీ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.