వరంగల్, ప్రభన్యూస్ : రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ వైద్య యాజమాన్యకోటా సీట్లభర్తీకి కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. యాజమాన్యకోటాకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తి అయింది. మాప్ ఆఫ్ విడత కౌన్సెలింగ్ తర్వాత ఖాళీగా ఉన్న పీజీ యాజమాన్యకోటా సీట్లభర్తీకి యూనివర్సిటీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం నుండి బుధవారం మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొంది. గత విడత కౌన్సిలింగ్ లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కంటిన్యూ చేసినా, అదే విధంగా ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే చేరిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కు అనర్హులుగా పేర్కొంది. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..