Tuesday, November 26, 2024

TS : అసాంఘిక శక్తులకు సహకరించవద్దు..ఎస్సై వెంకటేశ్వర్లు

వాజేడు, ఫిబ్రవరి 29( ప్రభ న్యూస్) : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని బొల్లారం గ్రామంలో వాజేడు ఎస్సై వెంకటేశ్వర్లు కార్డున్ చర్చ్ నిర్వహించారు. అక్కడికి గిరిజనులతో మాట్లాడుతూ అసాంఘిక శక్తులకు సహకరించవద్దని ఎవరైనా సహకరించి ఆశ్రయం ఇచ్చినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.

ఎవరికైనా సమస్యలు తలెత్తినట్లయితే నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి చెప్పుకోవాలనిఆయన అన్నారు.గ్రామాలలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సంచరించినట్లయితే వెంటనే సమాచారం అందించాలని ఆయన కోరారు. ఇటీవల చతిస్గడ్ రాష్ట్రంలో ఎన్ కౌంటర్ జరిగిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘాపెట్టి మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో గస్తీ తిరుగుతూ కార్డున్ చర్చలు నిర్వహిస్తున్నారు. చత్తీస్‌ఘ‌డ్ సరిహద్దు గ్రామాలలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. అపరిచిత వ్యక్తుల చిరునామాలను సైతం సేకరించి విచారిస్తున్నట్లు సమాచారం దీనిలో భాగంగానే బొల్లారంలో కార్డున్ చర్చ్ నిర్వహించారు. అదేవిధంగా మండల పరిధిలోని ఘనపురం గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ జవాన్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement