కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చూస్తుందని అందులో భాగంగా ఇటీవల బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి 33 వేల కోట్ల రూపాయలని తగ్గించిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. లేబర్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన రోజు వారి కూలీ డబ్బులు కేంద్రం ఇవ్వడం లేదన్నారు. గ్రామానికి అవసరమైన పనులను చేయించకుండా కేంద్రం చూపించిన పనులు మాత్రమే చేయాలని సర్కులర్ జారీ చేసిందన్నారు. ఉపాధి హామీ పథకం నిధులు తగ్గించడం వల్ల చాలా మంది పేదలు ఇబ్బంది పడుతున్నారన్నారు. వ్యవసాయ కూలికి రోజుకు 257/- ఇవ్వాలని చట్టం ఉన్నప్పుటికీ ఏ ఒక్క కూలికి 100/- లకు మించడం లేదన్నారు. పని ప్రదేశాల్లో కనీస మౌళిక సదుపాయాలైన (టెంటు, మంచినీరు, గడ్డపారలు, పారలు, తట్టలు) అందించాలన్నారు. బీజేపీ వల్ల కేంద్ర ఆర్ధిక పరిస్థతి తిరోగమనపడుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక పరిస్థితి అభివృధి చేయాలని ప్రయత్నం చేస్తుంటే కేంద్రం ఉపాధి హామీ నిధులు తగ్గించిందన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం 8 గం.లు పని చేసిన కూలికి 480/- ఇవ్వాలని ఉన్నప్పటికి ఉపాధి హామీ కూలీలకు మాత్రం కనీస కూలీ అందటం లేదన్నారు. NMMS App ద్వారా గ్రామీణ & అటవి ప్రాంతాల్లో సిగ్నల్స్ లేకపోవడంతో ఉ౹౹.10 గం.లకు & సా॥.4 గం.లకు కంప్యూటర్ లో అప్లోడ్ చేయాలనే నిబందన ఉండటం వల్ల కూలీలు పనులకు దూరం అవుతున్నారు. సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతలతో కూలీలుగా వారే ఉంటున్నారు కాబట్టి వ్యవసాయాన్ని అనుసందానం చేయటం వల్ల రైతులకు, కూలీలకు గిట్టుబాటు అవుతుందన్నారు. పంట స్థాయిని బట్టి ఎకరానికి కూలీ టోకెన్లు, మస్టర్ లో 100 పని దినాలు వుండే విధంగా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్ నుండి మండల స్థాయి APOల వరకు ఉద్యోగ కార్మికులు వేలాదిమంది పని చేస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. వ్యవసారంగానికి ఉపాధి హామీ పథకం అనుసంధం చేయాలని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసిన కూడా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. అసెంబ్లీ తీర్మానం అమలు చేయాలని ఈ నెల 9 నుండి 15 వరకు వారం రోజుల పాటు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కి ఉత్తర యుద్ధం ద్వారా ఉత్తరాలు రాసి నిరసన తెలియచేయాలని రైతులకు ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు, పిలుపునివ్వడం జరిగిందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement