Wednesday, October 30, 2024

ఎవరూ ఆందోళన చెందొద్దు.. ఆదుకుంటాం.. మంత్రి సత్యవతి

ఎవరూ ఆందోళన చెందొద్దని.. ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు మంత్రి సత్యవతి రాథోడ్ రెండు రోజులుగా ములుగు జిల్లాలో ఉంటూ, పరిస్థితుల పై అధికారులతో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలో నిర్విరామంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను మంత్రి సత్యవతి రాథోడ్ పర్యవేక్షిస్తున్నారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ములుగు జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేశామన్నారు. జిల్లా జిల్లా కలెక్టర్,ఎస్పీ ఉన్నతాధికారులతో వరద ప్రవహిత ప్రాంతాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కొండాయిలో భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, త్రాగునీరు, హెలికాప్టర్ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండాలని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement