బీఆర్ఎస్ ను ఓడించడం ఎవరితరం కాదని ఎమ్మెల్యే నన్నపుననేని నరేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేస్తున్న అభివృద్ధిపై ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ 34వ డివిజన్ అధ్యక్షులు పరిమిల్ల బిక్షపతి, 36వ డివిజన్ అధ్యక్షులు ఎస్కె.సోహెల్ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ… గత పాలకులు వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని వెనుక పడేశారని, ప్రజల అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం తోడ్పాటునందించలేదన్నారు. ప్రజలను అడ్డం పెట్టుకొని వారి వ్యక్తిగతంగా సంపాదించుకున్నారే తప్ప ఏనాడు నియోజకవర్గం బాగు కోరలేదన్నారు.
- తాను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడ అవసరాలు తెలిసిన వ్యక్తిగా ఒక నిరుపేదకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే మునుపెన్నడూ చూడని విధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించానన్నారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ కు అధ్యక్షులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులే నేడు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ నాయకత్వన తాను చేస్తున్న అభివృద్ధికి సంపూర్ణ మద్దతు తెలపాలని వారు బీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటానని, సముచిత స్థానం కల్పించి అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.
- ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ… వరంగల్ నగరంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ ఫలాలు నిరుపేదలకు ఉపయోగకరంగా ఉన్నాయని వరంగల్ జిల్లా కేంద్రం తీసుకురావడం, కలెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూ.1250 కోట్లతో నిర్మించడం, వరంగల్ బస్టాండ్, రోడ్లు, డ్రైనేజీ, డబుల్ బెడ్ రూములు, అనేక సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తున్న కేసీఆర్, ఎమ్మెల్యే నరేందర్ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని చేరినట్టు వారు చెప్పారు. ఎమ్మెల్యే నరేందర్ ను అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, ఎండీ పూర్ఖన్, బీఆర్ఎస్ నాయకులు మర్రి శ్రీనివాస్, దుబ్బ శ్రీనివాస్, శర్పొద్దీన్, బుపాల్, సురేష్, యాకయ్య, అధ్యక్షుడు గుల్బర్, అక్బర్, సురేష్, రాంకీ, లడ్డు, తదితరులు పాల్గొన్నారు.
కారే కావాలి సారే రావాలి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కారే కావాలి సారే రావాలి అనే నినాదంతో బైక్ పై జన చైతన్య యాత్ర నిర్వహిస్తున్న కేసీఆర్ వీరాభిమాని మహేష్(వికలాంగులు) కేసీఆర్, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పథకాలను తన బైక్ పై ప్లెక్సీలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా నేడు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో నన్నపునేని నరేందర్ ను కలిసి తన బైక్ యాత్ర గురించి వివరించి, అభివృద్ధి పథకాలు, తన యాత్రకు సంబంధించిన కరపత్రాన్ని ఎమ్మెల్యే నరేందర్ కు అందించారు. నియోజకవర్గ వ్యాప్తంగా తన ప్రచారం కొనసాగుతుందని మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మహేష్ ను అభినందించారు.