Tuesday, November 12, 2024

TS : లాజిస్టిక్స్ లో అక్రమ వసూళ్లు లేవు…ఏటీఎం పవన్ కుమార్

తొర్రూరు టౌన్, ఫిబ్రవరి 29(ప్రభ న్యూస్) : టిఎస్ఆర్టిసి లాజిస్టిక్ తొర్రూర్ సెంటర్ పై తప్పుడు సమాచారంతో వార్త రూపంలో ప్రచూరించిన వార్తలో వాస్తవం లేదని ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా లాజిస్టిక్స్ ఏటీఎం పవన్ కుమార్ అన్నారు.పవన్ కుమార్ మాట్లాడుతూవేరే పత్రికలో తొర్రూరు లాజిస్టిక్స్ పైన అక్రమ వసూళ్లు చేస్తున్నారని వార్తలో వాస్తవం లేదని,వార్త ప్రచురించిన వెంటనే సమాచారం మేరకు మేము తొర్రూరు లాజిస్టిక్స్ సెంటర్ కు వెళ్లి విచారించడం జరిగిందన్నారు.

- Advertisement -

తొర్రూరు లాజిస్టిక్స్ సెంటర్లో అక్రమ వసూళ్లపై ఎటువంటి నిజమైన ఆధారాలు లేవున్నారు.లాజిస్టిక్స్ సెంటర్ కు వచ్చిన కస్టమర్ లను చాలా మందిని మేము విచారించడం జరిగిందన్నారు.కానీ అలాంటి అక్రమ వసూళ్లపై ఎవరు కూడా పిర్యాదు ఇవ్వలేదన్నారు.ఇలాంటి తప్పుడు వార్తలు రాసే వ్యక్తులను నమ్మకుడదని..సంస్థపై ఎలాంటి నమ్మకాన్ని కొల్పోకుడదని మా సంస్థను మరియు ఆర్టీసి లాజిస్టిక్ సర్వీస్ ను వినియోగించుకోవాలని ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా ఎటిఎం పవన్ కుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement