Friday, November 22, 2024

WGL: ఇవాళ అవిశ్వాస పరీక్ష… స్వంత పార్టీలో అవిశ్వాస చిచ్చు

వరంగల్ జిల్లా నర్సంపేట పురపాలక సంఘంలో మరి కొద్ది గంటల్లో అవిశ్వాస పరీక్ష జరగనుంది. అయితే అవిశ్వాస పరీక్ష లో నెగ్గడానికి సరైన సంఖ్య బలం లేని కారణంగా అవిశ్వాస పరీక్షకు తీర్మానం ఇచ్చిన కౌన్సిలర్లు హాజరు కావడం లేదని సమాచారం. మొత్తం మున్సిపాలిటీలో 24మంది సభ్యులు ఉండగా 18 మంది బి అర్ ఎస్ పార్టీకి చెందిన వారు కాగా,6 గురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు.

అయితే, బి అర్ ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్పర్సన్ రజనీ కిషన్ పై స్వంత పార్టీ సభ్యులే అవిశ్వాస తీర్మానం ఈ నెల 2న జిల్లా అధికారులకు ఇవ్వగా ఈరోజు అవిశ్వాస పరీక్షకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అవిశ్వాస పరీక్షలో నెగ్గలంటే 17మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ఉన్న 18మందిలో 14మంది అవిశ్వాసానికి తెరలేపి ప్రయత్నాలు చేయగా మున్సిపల్ ఛైర్పర్సన్ రజనీ కిషన్ ఇద్దరు కౌన్సిలర్ల తో కలిసి మైసూర్ క్యాంపుకు తరలి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ అవిశ్వాస తీర్మానానికి ముందే నుండే దూరంగా ఉన్నారు. మొత్తం మీద అవిశ్వాసం అని తెరలేపిన కౌన్సిలర్ల కి రెండో సారి సైతం మొండి చేయే ఎదురైంది.ఈ అవిశ్వాస పరీక్ష బి అర్ ఎస్ పార్టీలో ఎటు దారి తీస్తుందో అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement