Friday, November 22, 2024

విధులపై వైద్యుల నిర్లక్ష్యం.. మెమోలు జారీ

కొత్తగూడ, మే 17 (ప్రభ న్యూస్) : ప్రజలకు ఆరోగ్య రీత్యా ఎల్లవేళలా ఉండవలసిన డాక్టర్ సమయపాలన పాటించకపోవడం, అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గుర‌వుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం రోజున అంకిత్ ఐటీడీఏ ఏటూరునాగారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ ఏఎన్ఎం తప్ప ఎవరు విధుల్లో లేకపోవడం అసహనాన్ని వ్యక్తం చేశారు. గత 5వ తేదీ నుండి కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆదేశాల ప్రకారం జరుగుతున్న సమ్మర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోచింగ్ బాలురు, బాలికలకు కొత్తగూడలోని మోడల్ స్కూల్ లో నిర్వహించడం జరుగుతుంది. వాటి తనిఖీలో భాగంగా పీవో అంకిత్ కు వింత అనుభవం ఎదురైనది. ఈ పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులకు గాయాలు, మరేదైన ఆరోగ్యం సరిగలేకపోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తారు. ఆ సమయంలో వారు లేకపోవడంతో డాక్టర్ల పనితీరు కనబడుతుంది అన్నారు.

అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, వైద్యులు, ఇతర సిబ్బంది లభ్యతపై అందుబాటులో ఉన్న ఏఎన్‌ఎంతో ఆరా తీశారు. మహబూబాబాద్‌లో వైద్యులు సమావేశ‌మై వెళ్లినట్లు ఏఎన్‌ఎం తెలిపినట్లు, ఆ సమయంలో పేషంట్లు వస్తే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. డ్రగ్స్ స్టోర్ రూమ్, ఔషధాల లభ్యతను, ప్రయోగశాలను, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. నేటి వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలను విచారించాలని, గైర్హాజరైన సిబ్బంది అందరికీ మెమో జారీ చేయాలని డిప్యూటీ జిల్లా వైద్య,ఆరోగ్య అధికారి (ఏజెన్సీ) ఐటిడిఏ ఏటూరునాగారంను ఆదేశించారు.

మారని డాక్టర్ల తీరు
గతంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్ పై వేటు పడిన విషయం తెలిసిందే.. ఆ విషయం మరువకముందే ఈ డాక్టర్ విధుల్లో లేకపోవడంతో డాక్టర్లు మారిన వారి తీరు మారడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement