Sunday, November 24, 2024

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో నిర్ల‌క్ష్యం.. సిబ్బంది మ‌ధ్య వార్‌..!

ఎడపల్లి : ఆసుపత్రికి కూత వేటు దూరంలోనే కాలనీలో నివాసముంటున్న ఓ యువకుడు తన తల్లికి ఒళ్లు నొప్పుల ఉండ‌డంతో పక్కనే ఉన్న మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. ఇంకేముంది ఆ ఆసుపత్రి సిబ్బంది కాలం చెల్లిన మందు మాత్రలు ఇచ్చారు. అప్పటికే సుమారు ఆసుపత్రిలో 50కి పైగా రోగులు సందర్శించి తమకు అవసరమైన ముందులు తీసుకెళ్ళారు. అంటే అంత మందిలో ఎవ‌రెవ‌రికి ఏ మందులు ఇచ్చారో తెలియదు. ఇదంతా జరిగి నాలుగు రోజులైన ఈ ఘనట ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఎడపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎడపల్లికి చెందిన గంగశంకర్ అనే యువకుడు తల్లి ఆరోగ్య రిత్య మాత్రల కోసం వెళ్ల‌గా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అంతకు ముందు ఆసుపత్రి ఆవరణలో కాలం చెల్లిన మందులు పరిసర ప్రాంతాల్లో కాల్చినట్లు తెలిసింది‌.


భగ్గుమంటున్న విభేదాలు
ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. వర్గ విబేధాలతో ఆసుపత్రి నువ్వెంత అంటే నువ్వేంత అనే కోణంలో తరచు వారి మధ్య మాటల యుద్ధం పరిపాటిగా మారింది. అంతే కాకుండా ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపుతూ నిందించుకుంటూ ప్రజల ఆరోగ్య సేవలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
అంత రామ మయం
ఆసుపత్రిలో ఆ వైద్య ‌సిబ్బంది ఒకరు చెప్పిందే తడవుగా ఆసుపత్రిలో చీమ చీటుక్కుమనదు‌. జిల్లా కేంద్రానికి ఫలానా సంఘం నేతను, నేను చెప్పిందే మీరు వినాలి. లేదంటే మీకు ఇబ్బందులు తప్పవు అని అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని తమ కనుసన్నల్లో ఉంచుకోవడం ఆయన ప్రత్యేకత. జిల్లా స్థాయి అధికారులతో సన్నిహితంగా ఉంటూ బిల్డప్ ఇచ్చే ఈయన ఆసుపత్రికి అన్ని తానే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement