Tuesday, November 19, 2024

నా బలం బలగం ప్రజలే : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామని, ఎటు చూసినా బ్రహ్మాండమైన రోడ్లు, విద్య వైద్యంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్ లో 2కోట్ల 96లక్షల రూపాయల అభివృద్ధి పనులకు డివిజన్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ జెడ్పి చెర్మన్ సమ్మారావు,కార్పొరేటర్ సురేష్ జోషి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. నా బ‌లం బ‌ల‌గం ప్ర‌జ‌లే అన్నారు. ఇక్క‌డ 1100 కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని, నిన్ననే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. ఇప్పటికి 10 అంతస్తులు పూర్తి అయ్యి డిసెంబర్ లోపు హాస్పిటల్ ని అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. నిరుపేదలైన పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయంతో నియోజకవర్గంలో 7 గురుకులాలు, 2 డిగ్రీ కలశాలలు తీసుకొచ్చి పెదబిడ్డలు ఉన్నత విద్యకు తోడ్పాటునందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులను నాటి పాలకులు మరిచారని నేడు తాను ఎమ్మెల్యే అయ్యాక అన్నీ రోడ్లను గొప్పగా మార్చమన్నారు.

75 ఏండ్ల స్వాతంత్ర్య భారతదేశంలో 65 ఏండ్లు ఇతర పాలకులు పరిపాలించారని కేవలం 8 ఏండ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచారన్నారు. ప్రతి డివిజన్ ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం నిధులను కేటాయించిందని, అభివృద్ధి చేసి అద్భుతంగా మారుస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని అజంజాహి మిల్స్ గ్రౌండ్ లో సభ ఏర్పాటు చేసి అందులో కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని కోరామని, కొన్ని సమస్యల వల్ల ఆలస్యమైనా అజంజాహి మిల్స్ లో కలెక్టరేట్ సాధించామని అతి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. 75 కోట్లతో బస్ స్టేషన్, జిల్లా కేంద్రం, 5 కోట్లతో కార్మిక మహిళ భవనం, ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, మాంసాహారానికి ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని, తాను ఎమ్మెల్యే అవ్వకముందు పరిస్థితి తాను ఎమ్మెల్యే అయ్యాక జరిగిన అభివృద్ధిని ప్రజలే బేరీజు వేసుకోవాలని కోరారు. కరోనా ఆపత్కర పరిస్థితిల్లో 25వేల మందికి రేషన్ అందించామని, ఇప్పుడు కనిపించే కొందరు నాయకులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఎక్కడ పోయారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త బట్టలు వేసుకొని ప్రజలకు దర్శనమిస్తున్నారని ఎన్నికలవ్వగానే మళ్ళీ వారు కనిపించరని ఎమ్మెల్యే అన్నారు. కరోనా సమయంలో ఒక నాయకుడు కోళ్ల ఫారాల్లో పడుకుంటే మరొకరు ఫామ్ హౌస్ లో పడుకొని విలాసవంతగా గడిపి ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసారన్నారు అలాంటి నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. నేడు 13వ డివిజన్ లో 2 కోట్ల 96లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసామని కార్పొరేటర్ సురేష్ జోషి సారథ్యంలో డివిజన్ గొప్పగా అభివృద్ధి చేసుకుందామని జోషి ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల అవసరాలు తీర్చడంలో ముందుంటాడని ఎమ్మెల్యే అన్నారు. మాజీ జెడ్పి చేర్మెన్ సమ్మారావు మాట్లాడుతూ… ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అభివృద్ధికి నిధులు తేవడంలో ఘనుడని ఎమ్మెల్యే నరేందర్ కేటీఆర్ తో చర్చించి కలెక్టరేట్ సముదాయ ఏర్పాటుకు కృషి చేసిన తీరును స్వయంగా తాను చూశానని సమ్మారావు తెలిపారు. ప్రజల మనిషి నరేందర్ ను కాపాడుకోవాలని మళ్ళీ అద్భుతమైన మెజారిటీతో గెలిపించాల్సింగా కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement